కటక్‌ వన్డేలో భారత్‌ విజయం….

165

కటక్ లోని బారాబతి స్టేడియం వేదికగా జరిగిన రెండో వన్డేలో భారత్‌ 15పరుగుల తేడాతో విజయం సాధించింది. ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో ఇండియా చివరి ఓవర్లో విజయాన్ని అందుకుంది. మోర్గాన్‌ అద్భుత క్యాప్టెన్‌ ఇన్నింగ్స్‌ ఆడినా, ఇంగ్లాండ్‌ విజయాన్ని అందుకోలేకపోయింది. లక్ష్య చేదనలో దాటిగా ఆడిన ఇంగ్లాడ్‌ చివరి నిమిషంలో ఓటమిపాలైంది. కోహ్లీ కెప్టెన్సీలో రెండో వన్డే విజయం సాధించింది.

India vs England, 2nd ODI

చివరి ఓవర్లో 22 పరుగులు చేయాల్సిన సమయంలో భువనేశ్వర్ బంతి అందుకుని 6 పరుగులు మాత్రమే ఇచ్చాడు. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన కోహ్లీ సేన నిర్ణీత 50 ఓవర్లకు 6 వికెట్లు నష్టపోయి 381 పరుగులు చేసింది. యువరాజ్ సింగ్ 150, ధోనీ 134 పరుగులతో చెలరేగారు. అయితే తర్వాత భారీ విజయలక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లండ్ జట్టు దీటుగా బదులిచ్చింది. మరోసారి వరుసగా సెకండ్ వన్డేలో కూడా 350 పరుగుల మార్క్‌ను దాటింది.

స్కోర్ వివరాలు..

భారత బ్యాటింగ్: లోకేష్ రాహుల్ 5, శిఖర్ ధావన్ 11, కోహ్లీ 8, యువరాజ్ సింగ్ 150, ధోనీ 134, కేదార్ జాదవ్ 22, హర్థిక్ పాండ్యా 19(నాటౌట్), రవీంద్ర జడేజా 16(నాటౌట్).. మొత్తం 50 ఓవర్లకు 381/6.

ఇంగ్లండ్ బ్యాటింగ్: జాసన్ రాయ్ 82, అలెక్స్ హేల్స్ 14, రూట్ 54, ఇయాన్ మోర్గాన్ 102, బెన్ స్టోక్స్ 1, బట్లర్ 10. మొయిన్ అలీ 55, వోక్స్ 5, ఫ్లంకెట్ 26, విలే 5..