కోర్టు మెట్లకెక్కనున్న ప్రిన్స్ హ్యారీ…

34
- Advertisement -

బ్రిటన్ రాజవంశం నుంచి బయటికి వచ్చి స్వతంత్రంగా అమెరికాలో జీవిస్తున్న ప్రిన్స్ హ్యారీ మరోసారి వార్తలో నిలిచారు. తాజాగా తమపై చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడ్డారంటూ ఓ వార్త సంస్థపై హ్యారీ మరియు ఇతర ప్రముఖులు కలిసి కేసు వేశారు. తాజాగా ఈ కేసు విచారణకు రానుంది. ఈ కేసు విషయంపై కోర్టుకుహాజరై బోనుఓ నిలబడి సాక్ష్యం చెప్పనున్నారు. దీంతో 130యేళ్ల తర్వాత బ్రిటన్ రాజవంశం చరిత్రలో కోర్టు రూమ్‌లో సాక్ష్యం చెప్పనున్న వ్యక్తిగా నిలవనున్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా దీన్నిపై ఆసక్తి నెలకొంది.

ప్రముఖుల వ్యక్తిగత విషయాలను సేకరించేందుకుగానూ చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిందనే ఆరోపణలతో బ్రిటన్ కు చెందిన మిర్రర్ గ్రూప్‌పై కేసు వేశారు. ఈ ఆరోపణల్లో ఫోన్ హ్యాకింగ్ ప్రముఖమైంది. ఈ కేసులో ఫ్రిన్స్ హ్యారీతో పాటుగా మరో వందిమందికిపైగా ప్రముఖులున్నారు. కాగా ఈ కేసు విచారణ మే నెలలో ప్రారంభమైంది. ఇందులో భాగంగా లండన్ హైకోర్టులో హ్యారీ సాక్ష్యం చెప్పనున్నారు. 1870లో విడాకుల కేసు విషయంలో అప్పటి ఎడ్వర్డ్ 7 కోర్టుకు హాజరై సాక్ష్యం చెప్పారు. మరోకసారి పరువు నష్టం కేసులో కూడా హాజరై సాక్ష్యం చెప్పారు. ఈ రెండు కూడా ఆయన రాజు కాక ముందే జరిగాయి. తాజాగా ఫ్రిన్స్‌ హ్యారీ కూడా చేరిపోయారు.

Also Read: తెలంగాణ ఆచరిస్తుంది..దేశం అనుచరిస్తుంది: కేటీఆర్

- Advertisement -