దాయాదిపై ఇదే పెద్ద రికార్డు !

202
- Advertisement -

ఒకే రోజు.. రెండు కీల‌క మ్యాచ్‌లు. అందులోనూ ప్ర‌త్య‌ర్థి దాయాది పాకిస్థాన్. వేదిక కూడా బ్రిటన్. ఐసీసీ ఛాంపియ‌న్ ట్రోఫి ఫైన‌ల్ మ్యాచ్‌లో పాక్ తో త‌ల‌ప‌డిన బార‌త్ ఘోర ప‌రాజ‌యాన్ని మూట గ‌ట్టుకుంటే.. అందుకు భిన్నంగా హాకీలో మ‌నోళ్లు పాక్ జ‌ట్టుపై అద్భుత విజ‌యాన్ని సాధించారు. ఆదివారం పూర్తి ఏకపక్షంగా సాగిన చ్‌లోపాక్‌పై భారీ విజయం సాధించి క్వార్టర్‌ఫైనల్‌కు దూసుకెళ్లింది. హాకీ చరిత్రలో దాయాదిపై టీమ్‌ఇండియాకు ఇదే పెద్ద రికార్డు కావడం విశేషం.

pakistan vs India

ప్ర‌పంచ హాకీ లీగ్ సెమీఫైన‌ల్ టోర్నీలో భార‌త్.. పాకిస్థాన్‌పై 7-1 తేడాతో విజ‌యాన్ని సాధించింది. ఆట ప్రారంభం నుంచి త‌న అధిక్యాన్ని క‌న‌ప‌ర్చిన భార‌త్‌జ‌ట్టు ప్ర‌త్య‌ర్థికి ఏ ద‌శ‌లోనూ అవ‌కాశం ఇవ్వ‌లేదు. మంగళవారం ఆఖరి లీగ్ మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌తో మన్‌ప్రీత్‌సేన తలపడుతుంది. మ్యాచ్ తొలి క్వార్టర్ పదినిమిషాలు మినహా మొత్తం భారత్‌దే సంపూర్ణ ఆధిపత్యం. హర్మన్‌ప్రీత్‌సింగ్(13ని, 33ని), తల్విందర్‌సింగ్(21ని, 24ని), ఆకాశ్‌దీప్‌సింగ్(47ని, 59ని), ప్రదీప్‌మోర్(49ని) గోల్స్ చేశారు. మరోవైపు ప్రత్యర్థి పాక్ తరఫున ముహమ్మద్ ఉమర్(57ని) ఏకైక గోల్ చేశాడు. మ్యాచ్ విషయానికొస్తే తొలుత పాక్‌కు గోల్ చేసే అవకాశమచ్చినా జారవిడుచుకుంది. అయితే 13వ నిమిషంలో దక్కిన పెనాల్టీ కార్నర్‌ను హర్మన్‌ప్రీత్‌సింగ్ గోల్‌గా మలిచాడు.

ఇక హీరోలుగా అంద‌రి దృష్టిలో నిలిచే టీమిండియా క్రికెట‌ర్లు ఓట‌మితో జీరోలు అయితే.. పెద్ద‌గా ఫేం లేని హాకీ ఆటగాళ్లు అద్భుత విజ‌యంతో హీరోలుగా అవ‌త‌రించారు. ఇటీవల ఉగ్రదాడిలో చనిపోయిన జవాన్లకు సంఘీభావంగా భారత ఆటగాళ్లు నల్లరిబ్లన్లు ధరించి బరిలోకి దిగారు.

- Advertisement -