ఒలింపిక్స్‌లో కాంస్యం గెలిచిన భారత హాకీ టీమ్..

90
olympics

టోక్యో ఒలింపిక్స్‌లో భారత హాకీ టీమ్ కాంస్య పతకం గెలిచి 41 ఏళ్ల సుదీర్ఘ పతక నిరీక్షణకి తెరదించింది. కాంస్య పతక పోరులో జర్మనీని ఓడించి సత్తాచాటారు భారత ఆటగాళ్లు. గురువారం జరిగిన కాంస్య పతక పోరులో భారత్ జట్టు 5-4 తేడాతో విజయాన్ని అందుకుంది.

1980 ఒలింపిక్స్‌ హాకీలో చివరిసారిగా పతకం గెలిచింది భారత హాకీ జట్టు. ఇక టోక్యో ఒలింపిక్స్‌లో ఇది నాలుగో పతకం. భారత్‌కి ఇప్పటికే వెయిల్‌లిప్టర్ మీరాబాయి చాను రజత పతకాన్ని అందివ్వగా.. స్టార్ షట్లర్ పీవీ సింధు, బాక్సర్ లవ్లీనా కాంస్య పతకాలు అందించారు.