ఎంఎస్‌పీపై లిఖిత పూర్వక హామీ: కేంద్రం

141
Narendra Modi
- Advertisement -

వ్యవసాయ చట్టాల్లో సవరణలపై ప్రతిపాదనలను రైతు సంఘాలకు పంపింది కేంద్రం. ప్రభుత్వ మార్కెట్లను బలోపేతం చేసేలా సవరణ చేస్తామని కేంద్రం వెల్లడించింది. ఏపీఎంసీలపై రైతుల అభిప్రాయాలకు అనుగుణంగా సవరణలకు కేంద్రం సుముఖత వ్యక్తం చేసింది.

ఏపీఎంసీల్లో ఒకే ట్యాక్స్ ఉంటుందన్న సవరణకు కేంద్రం సానుకూలంగా ఉండగా ప్రైవేటు కొనుగోలుదారుల రిజిస్ట్రేషన్ ను తప్పనిసరి చేసేలా సవరణ చేయనుంది.ప్రైవేటుతో పాటు ప్రభుత్వం కూడా పంట సేకరణ చేసేలా మార్పు చేస్తామన్న కేంద్రం….వ్యాపారులు-రైతుల ఒప్పంద వివాద పరిష్కారంలో ఎస్‌డీఎంల అధికారాల సవరణకు సైతం కేంద్రం సుముఖత వ్యక్తం చేసింది.

ఒప్పంద వ్యవసాయంలో సివిల్ కోర్టును ఆశ్రయించేందుకు వీలు కల్పించేలా సవరణ చేస్తామని తెలిపింది.ఒప్పంద వ్యవసాయంలో రైతుల భూములకు రక్షణ కల్పించేలా మరో సవరణ…కనీస మద్ధతు ధరపై రాతపూర్వక హమీ ఇస్తామని కేంద్రం ప్రతిపాదన తీసుకొచ్చింది.పంట వ్యర్థాల దహనం అంశంపై పంజాబ్, హర్యానా రైతుల అభిప్రాయాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకునేందుకు ముందుకు వచ్చింది కేంద్రం.

ఢిల్లీ సింఘు సరిహద్దు వద్ద రైతు సంఘాల నేతల సమావేశం ప్రారంభమైంది. కేంద్రం పంపిన ప్రతిపాదనలపై సాయంత్రంలోగా తమ నిర్ణయాన్ని వెల్లడించనున్నాయి రైతు సంఘాలు.

- Advertisement -