లంకను చిత్తుచేసిన భారత్..సిరీస్ క్లీన్ స్వీప్

29
- Advertisement -

శ్రీలంకతో జరిగిన మూడో వన్డేలో భారత్ అద్భుత ఆటతీరు కనబర్చింది. లంకను చిత్తుచేస్తూ 317 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. భారత్ విధించిన 391 పరుగుల లక్ష్యంతో బరిలోకి శ్రీలంక 73 పరుగులకే కుప్పకూలింది. లంక జట్టు కేవలం 22 ఓవర్లు మాత్రమే ఆడింది. లంక బ్యాటర్లలో ఓపెనర్ నువనిదు ఫెర్నాండో 19, కసున్ రజిత 13 (నాటౌట్), కెప్టెన్ దసున్ షనక 11 పరుగులు చేశారు.

ఇక అంతకముందు బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో 5 వికెట్లు కొల్పోయి 390 పరుగులు చేసింది.విరాట్ కోహ్లీ, ఓపెనర్ శుభ్ మాన్ గిల్ సూపర్ సెంచరీలతో రాణించారు. 110 బంతుల్లో 8 సిక్స్‌లు, 13 ఫోర్లతో 166 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. శుభ్ మాన్ గిల్ (116) సెంచరీతో రాణించారు. కోహ్లీకి ఇది 46వ సెంచరీ.

ఇవి కూడా చదవండి..

- Advertisement -