శుభ్‌మన్ డబుల్‌ సెంచరీ…

37
- Advertisement -

2010లో సచిన్ టెండూల్కర్‌ డబుల్ సెంచరీ సాధించిన నాటి నుంచి నేటి వరకు డబుల్‌ సెంచరీ అంటే సెంచరీ చేసినట్టుగా…పాలు తాగినంత ఈజీగా దంచి కోడుతున్నారు. తాజాగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న పోరులో భారత ఓపెనర్‌ శుభమన్‌గిల్‌ డబుల్‌ సెంచరీ చేశాడు. హైదరాబాద్‌లోని ఉప్పల్‌ స్టేడియంలో జరుగుతున్న మూడు వన్డే సిరీస్‌లో భాగంగా మొదటి మ్యాచ్‌లో శుభమన్ డబుల్‌ సెంచరీ సాధించాడు. కేవలం 145 బంతుల్లోనే డబుల్ సెంచరీ సాధించాడు.

డబుల్‌ సెంచరీ చేసిన భారత ఆటగాళ్లో ఐదవ ఆటగాడిగా చరిత్ర కెక్కాడు. అంతకుముందు సచిన్ టెండూల్కర్‌ విరేంద్రసెహ్వగ్‌ రోహిత్‌ శర్మ ఇషాన్ కిషన్‌ సరసన చేరాడు. అయితే ఈ ఫీట్ సాధించిన అతి పిన్నవయస్కుడిగా నిలిచారు. శుభమన్ గిల్‌ 23ఏళ్ల 123 రోజులు కాగా గతంలో ఉన్న ఇషాన్ కిషన్( 24 ఏళ్ల 145 రోజులు) రికార్డును తిరగరాశాడు.

శుభ్‌మన్ గిల్‌ మొత్తం 149 బంతుల్లో, 208 పరుగులు చేసి ఔటయ్యాడు. శుభ్‌మన్ గిల్‌ ఇన్నింగ్స్‌లో 19 ఫోర్లు, 9 సిక్సర్లు బాదాడు. దీంతో ఇండియా 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి, 349 పరుగులు చేసింది. న్యూజిలాండ్‌కు 350 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. కివీస్ బౌలర్లలో హెన్రీ షిప్లీ 2 వికెట్లు, డెరైల్ మిచెల్ 2 వికెట్లు తీయగా, ఫెర్గూసన్, టిక్నర్, శాంట్నర్ ఒక్కో వికెట్ తీశారు.

ఇవి కూడా చదవండి…

ఉప్పల్ వేదికగా తొలి వన్డే..

సిటీలో రేపు ట్రాఫిక్ ఆంక్షలు ఎందుకంటే..

గడ్చిరోలి…జల్‌-జంగిల్-జమీన్ పోరాటం

- Advertisement -