ఐర్లాండ్ లో జరిగే టీ20 మ్యాచ్ లకు భారత ప్లేయర్లు సిద్దంగా ఉన్నారు. మొన్న నిర్వహించిన యో యో టెస్ట్ లో ప్లేయర్లను సెలక్ట్ చేసింది బీసీసీఐ. ఇంగ్లాండ్ లో రెండు మ్యాచ్ లు ఆడనున్నారు. ఈసందర్భంగా ఇండియా ప్లేయర్లు రేపు సాయంత్రం ఇంగ్లాండ్ కు బయల్దేరనున్నారని తెలిపారు బీసీసీఐ అధికారులు. ఈ మేరకు బీసీసీఐ ఓ ప్రకటన విడుదల చేసింది. కోహ్లి సారధ్యంలో టీమిండియా ప్లేయర్లు ఐర్లాండ్ సిద్దంగా ఉన్నారని ప్రకటన విడుదల చేశారు.
ఈనెల 27, 29న ఐర్లాండ్ తో టీమిండియా రెండు టీ20 మ్యాచ్ లు ఆడనున్న విషయం తెలిసిందే. సెలక్షన్ ముందు జరిపిన యో యో టెస్ట్ లో కొంత మంది ప్లేయర్లు ఫెయిల్ అవ్వడంతో వారిని ఈసిరిస్ ఆడటానికి అనుమతించలేదు. ఈసీరిస్ ప్రారంభానికి నాలుగు రోజలు ముందే ఐర్లాండ్ కు చేరుకోనున్నారు టీం ఇండియా ప్లేయర్లు. ఈ రెండు సీరిస్ లు ముగిసిన అనంతరం ప్లేయర్లు నేరుగా ఇంగ్లాండ్ వెళ్లనున్నారు.
ఈనేపథ్యంలో జులై 3వతేది నుంచి ఇండియా, ఇంగ్లాండ్ మధ్య టీ20 సీరిస్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ ల అనంతరం వన్డే, టెస్ట్ సిరీస్ లు జరుగనున్నాయి. ఈ మ్యాచ్ లు అన్నీ పూర్తయ్యాక ఇండియా టీం సెప్టెంబర్ నెలలో ఇండియాకు రానున్నారు. గతంలో ఇంగ్లండ్ తో ఆడిన మ్యాచ్ లో ధోని సేన నాయకత్వం వహించగా 1-3 తేడాతో ఓటమి పాలయ్యింది. ఇప్పుడు జరగబోయే మ్యాచ్ లలో కోహ్లి సేన ఏ మేరకు విజయం సాధింస్తోందో చూడాలి.