- Advertisement -
దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతూనే ఉంది. రోజుకు దాదాపు 28 వేలకు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో రికార్డు స్ధాయిలో 29,429 పాజిటివ్ కేసులు నమోదవగా, 582 మంది మరణించారు.
ఇక ఇప్పటివరకు దేశంలో 9,36,181 కరోనా కేసులు నమోదుకాగా 3,19,840 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 5,92,032 మంది కరోనా నుండి కోలుకోగా 24,309 మంది మరణించారు.
ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 1,24,12,664 కరోనా టెస్టులు నిర్వహించామని……24 గంటల్లో 3,20,161 మందికి కరోనా పరీక్షలు చేశామని తెలిపింది ఐసీఎంఆర్.
- Advertisement -