10,000 మొక్కలు నాటడమే లక్ష్యం : ఎమ్మెల్యే వెంకటేశ్వర్ రెడ్డి

203
gc
- Advertisement -

ఎంపీ సంతోష్ కుమార్ గారు చేపట్టినటువంటి గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా ఈ రోజు అన్న సాగర్ గ్రామంలో ఎల్లమ్మ గుట్ట దగ్గర మొక్కలు నాటడం జరిగింది. మూడు రోజుల క్రితం మంత్రి నిరంజన్ రెడ్డి గారు కరీంనగర్ జిల్లా పర్యటనలో భాగంగా మొక్కలు నాటి ముగ్గురు ఎమ్మెల్యే లకు ఛాలెంజ్ చెయ్యగా దానిలో భాగంగా ఈ రోజు ఛాలెంజ్ ను స్వీకరించి మొక్కలు నాటడం సంతోషం గా ఉంది అని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి తెలిపారు.

గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా ఎంపీ సంతోష్ గారు విసిరిన ఛాలెంజ్ ను ఈ రోజు యావత్తు దేశం మొత్తం ప్రాచుర్యం పొందింది. మొక్కలు నాటి నాటిన మొక్కను 100 % బతికించుకోవాలి.గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, ఎంపీ సంతోష్ కుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ 10,000 మొక్కలు ఎల్లమ్మ గుట్టలో నాటాలని నిర్ణయం తీసుకొని ఈ రోజు 2,000 మొక్కలను నాటడం జరిగింది.

ఈ వారం రోజుల్లో మొత్తం 10,000 మొక్కలు నాటబోతున్నాం అని తెలిపారు.గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా నేను కూడా ముగ్గురికి ఛాలెంజ్ విసురుతున్నా. వాళ్ళు కూడా ఛాలెంజ్ ను స్వీకరించి మొక్కలు తప్పకుండా నాటాలి. ఆ ముగ్గురి లో జడ్పీ చైర్మన్ స్వర్ణసుధాకర్ రెడ్డి గారు , స్పోర్ట్స్ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర్ రెడ్డి గారు , భూత్పూర్ ఎంపీపీ కదిరే శేఖర్ రెడ్డి గారు వున్నారు. వీళ్లు ఛాలెంజ్ ను స్వీకరించి మొక్కలు నాటి వీళ్ళు కూడా ముగ్గురి కి ఛాలెంజ్ చేయాల్సింది గా కోరుతున్నా అన్నారు.

- Advertisement -