దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 10 లక్షలు దాటాయి. గత మూడు రోజుల్లో లక్షకుపైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు కరోన బాధితుల సంఖ్య 10, 03, 832 చేరినట్లు ప్రకటించింది కేంద్ర ఆరోగ్య శాఖ.
గత 24 గంటల్లో అత్యధికంగా 34, 956 పాజిటివ్ కేసులు నమోదు కాగా 687 మంది మృతి చెందారు.3, 42, 473 మందికి కొనసాగుతున్న చికిత్స కొనసాగుతుండగా కరోనా నుండి ఇప్పటి వరకు 6, 35, 757మంది బాధితులు కోలుకున్నారు.కోవిడ్-19వైరస్ సోకి ఇప్పటివరకు 25, 602 మంది మృతి చెందగా నిన్న ఒక్కరోజే 22, 942 మంది బాధితులు కోలుకున్నారు.
అమెరికాలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. నిత్యం వేల సంఖ్యలో కొత్త కేసులు, వందల్లో మరణాలు సంభవిస్తుండడంతో అమెరిన్లు విలవిలలాడుతున్నారు. గురువారం వరకు ఆ దేశంలో 3.5 మిలియన్ల మంది ఈ మహమ్మారి బారినపడినట్లు ప్రఖ్యాత జాన్ హోప్కిన్స్ విశ్వవిద్యాలయం వెల్లడించింది. ఇప్పటివరకు 1,37,864 మంది మృతి చెందారు.