కల్వకుర్తికి నీటిని విడుదలచేసిన ఎమ్మెల్యే హర్షవర్దన్..

172
kalwakurthi

నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం ఎల్లూరు దగ్గర మహాత్మా గాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పధకం ద్వారా నీటిని విడుదల చేశారు ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి. శ్రీశైలం జలాశయానికి భారీగా నీరు వస్తుండడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల ప్రకారం కల్వకుర్తి ఎత్తిపోతల పధకం ద్వారా స్విచ్ ఆన్ చేసి రెండు మోటర్ల ద్వారా నీటిని విడుదల చేశారు.

అనంతరం కృష్ణమ్మకు పూలు చల్లి పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ దృఢ సంకల్పంతోతెలంగాణ రాష్ట్ర రైతుల కోసం ప్రధాన సాగునీరు ప్రాజెక్టులను ప్రారంభించి పంటలను సస్యశ్యామలం చేసిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కిందని. ఉమ్మడి పాలమూరు జిల్లా వరప్రదాయిని మహాత్మా గాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పధకం ద్వారా గత సంవత్సరం దాదాపు నాలుగు లక్షల ఎకరాలకు సాగునీరు అందించడం జరిగిందని అన్నారు.

అదేవిధంగా గత సంవత్సరం 50 టీఎంసీల నీటిని ఎత్తిపోసి సాగునీరు ఇవ్వడం జరిగిందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డితో పాటు ఇరిగేషన్ అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.