- Advertisement -
దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 94 లక్షలు దాటాయి. గత 24 గంటల్లో కొత్తగా 38,772 పాజిటివ్ కేసులు నమోదుకాగా 443 మంది మృతిచెందారు. దేశంలో ఇప్పటివరకు 94,31,692 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
ప్రస్తుతం దేశంలో 4,46,952 యాక్టివ్ కేసులుండగా 88,47,600 మంది బాధితులు మహమ్మారి నుంచి కోలుకున్నారు. కరోనాతో ఇప్పటివరకు 1,37,139 మంది కరోనా వల్ల మరణించారు. దేశంలో ఇప్పటివరకు 14,03,79,976 మందికి కరోనా పరీక్షలు చేయగా గత 24 గంటల్లో 8,76,173 నమూనాలను పరీక్షించామని భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐసీఎమ్మార్) వెల్లడించింది.
- Advertisement -