శివసేనలోకి ఉర్మిళా!

156
urmila
- Advertisement -

కాంగ్రెస్ మాజీ నేత,సినీ నటి ఉర్మిళా శివసేనలో చేరనున్నారు. ఇటీవలె కాంగ్రెస్ కు రాజీనామా చేసిన ఆమె శివసేనలో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించేందుకు సిద్దమయ్యారు. 2019 పార్లమెంట్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున నార్త్‌ ముంబై స్థానం నుంచి పోటీ చేసి బీజేపీ అభ్యర్థిపై ఓటమి పాలయ్యారు.

అదే ఏడాది కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన ఉర్మిళా రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. కాంగ్రెస్‌ లో పెద్ద లక్ష్యం కోసం పనిచేయడానికి బదులు అంతర్గత రాజకీయాలు, పార్టీలోని స్వార్థ ప్రయోజనాలతో పోరాటం చేయడం చాలా కష్టమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ముంబైలో తన ఓటమికి పార్టీలోని కొన్ని వర్గాలు పనిచేశాయని తీవ్ర విమర్శలు చేసింది. కాంగ్రెస్‌పై తనకు భ్రమలు తొలిగిపోయాయని వ్యాఖ్యానించడం సంచలనంగా మారింది.

- Advertisement -