దేశంలో 51 లక్షలు దాటిన కరోనా కేసులు..

263
corona
- Advertisement -

దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతూనే ఉంది. రోజుకు 90 వేలకు పైగా కేసులు నమోదవుతుండగా ఇప్పటివరకు కేసుల సంఖ్య 51 లక్షలు దాటాయి. గ‌త 24 గంట‌ల్లో దేశంలో కొత్త‌గా 97,894 కరోనా కేసులు నమోదుకాగా 1132 మంది మరణించారు. దీంతో దేశ‌వ్యాప్తంగా కరోనా వైర‌స్ పాజిటివ్ కేసుల సంఖ్య 51,18,254గా ఉండగా 10,09,976 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

కరోనాతో ఇప్పటివరకు 83,198 మంది మృత్యువాతపడగా 40,25,080 మంది వైర‌స్ నుంచి కోలుకున్నారు. 24 గంటల్లో 11,36,613 టెస్టులు చేయగా మొత్తం టెస్టుల సంఖ్య 6 కోట్లు దాటాయి.

- Advertisement -