అత్యంత సుందరంగా కుంభ మేళా కు ముస్తాబైంది ప్రయాగ్ రాజ్. జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు 45 రోజుల పాటు నిర్వహించనున్న ఈ ఉత్సవానికి ప్రపంచవ్యాప్తంగా దాదాపు 40 కోట్ల మంది వస్తారని అంచనా. ఈ నేపథ్యంలో అధికారులు పెద్దఎత్తున ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.
కుంభ మేళా కు వచ్చే భక్తులకు భారీ ఏర్పాట్లు చేసింది ప్రభుత్వం. భారీ భద్ర నడుమ కుంభ మేళా నిర్వహిస్తుంది యోగి సర్కార్. ఎక్కడికక్కడ బారికేడ్లను ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహిస్తున్నారు పోలీసులు.
కుంభ మేళాకు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పటిష్టమైన చర్యలు చేపడుతున్నారు అధికారులు. కుంభ మేళాకు భారీగా తరలి వచ్చి గంగా నదిలో పవిత్ర స్నాన మాచరిస్తున్నారు భక్తులు. కుంభ మేళాకు రావటం పూర్వజన్మ సుకృతం గా భావిస్తున్నామంటున్నారు భక్తులు.
Also Read:TTD: అసత్య ప్రచారం సరికాదు

