ఆసీస్‌పై భారత్‌ ఘన విజయం..

281
- Advertisement -

టీమిండియా థ్రిల్లింగ్‌ విక్ట‌రీ కొట్టింది. తప్పక గెలవాల్సిన అడిలైడ్‌ వన్డేలో కోహ్లీసేన చక్కగా రాణించింది. చివరి వరకూ ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో విజయం టీమిండియాను వరించింది. ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేయడంలో భారత బౌలర్లు తడబడినా, పరుగులు రాబట్టడంలో బ్యాట్స్‌మెన్‌ చివరి వరకూ పోరాడి విజయం సాధించారు. చివ‌రి ఓవ‌ర్ వ‌ర‌కు సాగిన గేమ్‌లో.. కోహ్లీ, ధోనీలు తమ బ్యాటింగ్ ట్యాలెంట్‌తో ఆక‌ట్టుకున్నారు.

India vs Australia

పరుగుల యంత్రం, కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి(104) శతకంతో రాణించిన వేళ రెండో వన్డేలో టీమిండియా 6 వికెట్ల తేడాతో ఆసీస్‌పై ఘన విజయం సాధించింది. కంగారూలు నిర్దేశించిన 299 పరుగుల లక్ష్యాన్ని మరో నాలుగు బంతులు మిగిలి ఉండగానే ఛేదించి మూడు వన్డేల సిరీస్‌ను 1-1తో సమం చేసింది. నిర్ణయాత్మక మూడో వన్డే మెల్‌బోర్న్‌ వేదికగా జనవరి 18న జరగనుంది.

- Advertisement -