బీజేపీకి షాక్ ఇచ్చిన సుప్రీంకోర్టు..

208
BJP

పశ్చిమబెంగాల్‌లో రథయాత్రలు నిర్వహించాలనుకున్న బీజేపీకి సుప్రీంకోర్టు షాకిచ్చింది. . బీజేపీ రథయాత్ర వల్ల పశ్చిమబెంగాల్‌లో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని, మత ఘర్షణలు చోటుచేసుకునే ప్రాంతాల్లోనే రథయాత్ర మ్యాప్ ఉందని కోర్టుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. పశ్చిమ బెంగాల్ తెలిపిన అభ్యంతరాలను సుప్రీంకోర్టు తోసిపుచ్చకుండా.. రథయాత్రలకు సవరించిన రూట్ మ్యాప్‌ను కోర్టుకు సమర్పించాలని బీజేపీని సుప్రీంకోర్టు ఆదేశించింది.

BJP

బహిరంగసభలను మాత్రమే నిర్వహించుకోవాలంటూ ఆదేశాలు జారీ చేసింది. కేసు వివరాల్లోకి వెళ్తే, ప్రజాస్వామ్య పరిరక్షణ యాత్రలను నిర్వహించాలనుకున్న బీజేపీకి పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అడ్డు తగిలారు. శాంతభద్రతలకు విఘాతం కలుగుతుందనే కారణాలతో యాత్రకు ఆ రాష్ట్ర ప్రభుత్వం అనుమతిని నిరాకరించింది.

దీంతో కలకత్తా హైకోర్టును బీజేపీ ఆశ్రయించింది. పిటిషన్‌ను విచారించిన హైకోర్టు సింగిల్ బెంచ్ యాత్రలకు అనుమతి ఇచ్చింది. దీంతో, హైకోర్టు డివిజన్ బెంచ్‌కు మమత ప్రభుత్వం అప్పీల్ చేసింది. యాత్రలకు అనుమతిని నిరాకరిస్తున్నట్టు డివిజన్ బెంచ్ తీర్పును వెలువరించడంతో… బీజేపీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ సుప్రీం తీర్పును వెలువరించింది.