రెండో టెస్ట్…భారత్ 202 ఆలౌట్

67
ind

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 202 పరుగులకు ఆలౌట్‌ అయింది. కెప్టెన్ కేఎల్ రాహుల్ 133 బంతుల్లో 50 పరుగులు చేసి ఔట్ కాగా మయాంక్ అగర్వాల్ 26 పరుగులు చేసి రాణించారు. మిగితా బ్యాట్స్ మెన్ విఫలం కావడంతో భారత్ భారీ స్కోరు సాధించలేకపోయింది.

తొలుత టాస్ గెలిచిన భారత కెప్టెన్ కేఎల్ రాహుల్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఓపెనర్లు శుభారంభం అందించగా మిగితా వారు సహకారం అందించలేదు.చివర్లో అశ్విన్(46), జస్‌ప్రీత్ బుమ్రా (14) రాణించడంతో భారత్ 200 పరుగుల మార్క్‌ను దాటింది. సౌతాఫ్రికా బౌలర్లలో మార్కో జెన్సన్ నాలుగు వికెట్లు, ఓలివర్ మూడు వికెట్లు, కాగిసో రబడ మూడు వికెట్లు తీశారు.