లాక్ డౌన్‌పై క్లారిటీ ఇచ్చిన శ్రీనివాసరావు..

19
dmho

రాష్ట్రంలో లాక్‌డౌన్‌పై క్లారిటీ ఇచ్చారు హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు. జనవరి చివరి వారంలో రాష్ట్రంలో లాక్ డౌన్ వస్తుందని తాను చెప్పినట్లుగా సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో నిజంలేదన్నారు. ఇలాంటి తప్పుడు ప్రచారం చేసే వారపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణ రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ, లాక్‌డౌన్ ఉండబోవని ఇదివరకే చెప్పామని.. మరోసారి అదే విషయాన్ని స్పష్టం చేస్తున్నానని తెలిపారు. రాష్ట్రంలో కరోనా కేసులు, ఒమిక్రాన్ కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. గత కొద్ది రోజులుగా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నాయి. దీంతో ప్రజల్లో ఆందోళన కనిపిస్తోంది.