లార్డ్స్ టెస్ట్‌: విజయం దిశగా భారత్..

118

లార్డ్స్ మైదానంలో జరుగుతున్న టెస్టు మ్యాచ్ లో భారత్ విజయం దిశగా అడుగులు వేస్తోంది. 272 పరుగుల లక్ష్యఛేదనకు బరిలో దిగిన ఇంగ్లండ్ ను ఆదిలోనే దెబ్బకొట్టింది. టీమిండియా బౌలర్ల ధాటికి ఇంగ్లండ్ ఓపెనర్లు డకౌట్ అయ్యారు. పరుగుల ఖాతా తెరవకముందే పెవిలియన్ చేరారు. తొలుత రోరీ బర్న్స్ ను బుమ్రా అవుట్ చేయగా, ఆపై డామ్ సిబ్లీని షమీ వెనక్కి పంపాడు. దాంతో ఇంగ్లండ్ శిబిరంలో తీవ్ర నిరాశ నెలకొంది.

ప్రస్తుతం ఆతిథ్య జట్టు స్కోరు 22 ఓవర్లలో 5 వికెట్లకు 67 పరుగులు. క్రీజులో కెప్టెన్ జో రూట్ (4 బ్యాటింగ్), హసీబ్ హమీద్ (6 బ్యాటింగ్) ఉన్నారు. ఇంగ్లండ్ విజయం సాధించాలంటే ఇంకా 205 పరుగులు చేయాల్సి ఉండగా, టీమిండియా గెలుపునకు 5 వికెట్ల దూరంలో ఉంది.