- Advertisement -
దేశంలో కరోనా బాధితుల సంఖ్య 2301కి చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. కరోనా నుండి ఇప్పటివరకు 156 మంది కోలుకున్నారని 2088 మందికి చికిత్స కొనసాగుతుందన్నారు. ఇప్పటివరకు కరోనాతో 56 మంది మృతి చెందారని వెల్లడించింది.
కరోనాను ఎదుర్కొనేందుకు ప్రపంచ బ్యాంక్ పలు దేశాలకు ఆర్థికసాయం ప్రకటించింది. 25 దేశాలకు 1.9 బిలియన్ డాలర్ల సాయం ప్రకటించింది. ఈ అత్యవసర ఆర్థికసాయంలో అత్యధికంగా భారత్కు 1 బిలియన్ డాలర్లను కేటాయిస్తూ గురువారం నాడు జరిగిన బోర్డ్ ఆఫ్ ఎక్స్గ్యూటివ్ డైరెక్టర్స్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.
కరోనా స్క్రీనింగ్, కాంటాక్ట్ ట్రేసింగ్, లాబోరేరీల ఏర్పాటు, డయాగ్నోస్టిక్స్, పీపీఈల కొనుగోలు, ఐసోలేషన్ వార్డుల ఏర్పాటుకు నిధులను వినియోగించనున్నారు.
- Advertisement -