పెట్స్‌ ద్వారా కరోనా రాదు:అమల

164
amala

పెంపుడు జంతువుల ద్వారా కరోనా వైరస్ వ్యాపించదని తెలిపారు సినీ నటి అక్కినేని అమల. జంతు సంరక్షణ కర్తగా ఉన్న అమల..పెంపుడు జంతువులతో కరోనా వ్యాపిస్తుందన్న వదంతులను నమ్మవద్దని తెలిపారు.

పెంపుడు జంతువుల నుంచి మనషులకు వైరస్‌ వ్యాప్తి చెందదని..జంతువుల నుండి మనషులకు వ్యాధి సంక్రమిస్తుందన్న ఆధారాలు లేవన్నారు.

ఇక ఇప్పటివరకు తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 154కు చేరుకోగా 17 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం తెలంగాణలో 128 కరోనా యాక్టివ్ కేసులు ఉండగా 9 మంది ప్రాణాలు కొల్పోయారు.