కరోనా మృతుల్లో వృద్ధులే ఎక్కువ..

60
corona

దాదాపు 202 దేశాలకు పైగా విస్తరించిన కరోనా మహమ్మారితో ప్రజలు వణికిపోతున్నారు. ఇప్పటివరకు 40 వేలకి పైగా మృతి చెందగా భారత్‌లో కూడా కరోనా రోజురోజుకి కరోనా మృతులు పెరిగిపోతున్నారు.

ఇక ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు చనిపోయిన వారిలో వృద్ధులే ఎక్కువమంది ఉన్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డ్యబ్లూహెచ్‌వో) వెల్లడించింది. కరోనా వ‌ల్ల మ‌ర‌ణిస్తున్న వారిలో 95శాతం వృద్ధులే ఉన్నారని వెల్లడించింది.

మ‌ర‌ణించిన వారు గుండె జ‌బ్బులు, హైబీపీ, షుగ‌ర్ లాంటి వ్యాధుల‌తో బాధ‌పడుతున్నవారేన‌ని వివ‌రించింది. అటు 20 ఏండ్ల లోపు వారికి కూడా క‌రోనా సోకుతుంద‌ని…త‌మ‌కు రాద‌ని భావించ‌డం స‌రికాద‌ని పేర్కొంది. సోష‌ల్ డిస్టెన్స్ పాటిస్తూ..అన్ని జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని డ్యబ్లూహెచ్‌వో సూచించింది.