త్రివర్ణమయమైన బుర్జ్‌ ఖలీఫా

254
In Tribute Burj Khalifa Lit Up In Colours Of Indian Flag
- Advertisement -

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన బుర్జ్‌ఖలీఫా భారత జాతీయ పతాకంలోని మూడు రంగులతో ధగధగలాడింది. 68వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా గ్లోబల్ డెవలపర్ ఎమ్మార్ ప్రాపర్టీస్, యుఎయితో కలిసి ఈ ప్రదర్శనలో పాల్గొంది. జనవరి 25, 26 రెండు రోజుల్లో సాయంత్రం 6.15 , 7.15 గంటలతోపాటు రాత్రి 8.15 గంటలకు మూడు సార్లు బుర్జ్‌ఖలీఫా త్రివర్ణమయం కానుంది.

దుబాయ్‌లో ఉన్న ఈ భవనం 823 మీటర్ల ఎత్తుంది. అబుదాబి పాలకుడు, యూఏఈ అధ్యక్షుడు ఖలీఫా బిన్‌ జయేద్‌ అల్‌ నహ్యాన్‌ గౌరవార్థం ఈ భవనాన్ని నిర్మించారు.ఈ ఏడాది గణతంత్ర దినోత్సవాల ముఖ్య అతిథిగా అబుదాబి యువరాజు షేక్‌ మహమ్మద్‌ బిన్‌ జయేద్‌ అల్‌ నహ్యాన్‌ హాజరుకానుండటం తెలిసిందే.

కాగా, బుధవారం అబుదాబి రాజు షేక్ మొహ్మద్, ప్రధాని మోడీ హైదరాబాద్ హౌజ్‌లో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా 14 ఒప్పందాలపై ఇరు దేశాల నేతలు సంతకాలు చేశారు. పలు అంశాలపై సుదీర్ఘ చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఈ ముఖాముఖి చర్చలో భాగంగా భవిష్యత్తులో రెండు దేశాల మధ్య స్నేహా బంధం కొనసాగే విధంగా నిర్ణయాలు జరిగాయని సమాచారం.

- Advertisement -