ఆర్సీబీ మోసం చేసింది…

237
I'm a king, was destined to play for Punjab says Gayle
- Advertisement -

ఏడేళ్ల పాటు ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అద్భుత విజయాలను అందించాడు విండీస్ విధ్వంసక ఆల్‌ రౌండర్‌ క్రిస్ గేల్. కానీ ఐపీఎల్‌-2018లో సీన్ పూర్తిగా రివర్సైంది. గేల్‌కు ఐపీఎస్ ప్రాంఛైజీలు గట్టిషాకిచ్చాయి. గేల్‌ను కొనుగోలు చేసేందుకు ఎవరు ముందుకు రాలేదు. చివరికి పంజాబ్ గేల్‌ను దక్కించుకున్న తుదిజట్టులో చోటు దక్కలేదు.

రెండు మ్యాచ్‌ల తర్వాత తుదిజట్టులో చోటుసంపాదించిన గేల్‌ విధ్వంసక ఆటతీరుతో విరుచుకపడ్డాడు.పంజాబ్‌కు అద్భుత విజయాలను అందించాడు. ఈ నేపథ్యంలో ఆర్సీబీపై తీవ్రస్ధాయిలో మండిపడ్డాడు. ఐపీఎల్‌-11 వేలానికి ముందు తనను ఆర్సీబీ ప్రాంఛైజీ తిరిగి అంటిపెట్టుకుంటామని మాట ఇచ్చి మోసం చేసిందన్నారు. ఆర్సీబీ యాజమాన్యం తీరు తనను బాధించిందన్నారు.

సీపీఎల్, బీపీఎల్‌లో అద్భుతంగా రాణించానని… బీపీఎల్‌లో రంగపూర్ రైడర్స్ తరఫున రెండు సెంచరీలు సాధించానని చెప్పాడు. ఐపీఎల్ వేలంలో నన్ను ఎవరూ కొనుగోలు చేయకపోవడంపై ఆశ్చర్యపోయా….ఆఖరి రౌండ్లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ నాపై నమ్మకముంచింది….పంజాబ్ తరఫున ఆడాలని రాసి పెట్టి ఉందని గేల్ వ్యాఖ్యానించాడు.

టీ20 క్రికెట్లో క్రిస్‌గేల్ ఎంత ప్రమాదకర ఆటగాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టోర్నీ ఏదైనా, ప్రత్యర్థి ఎవరైనా బంతిని స్టాండ్స్‌లోకి పంపడమే గేల్‌ టార్గెట్‌. ఐపీఎల్‌లో అత్యధిక సిక్స్‌లు భాదిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పిన సంగతి తెలిసిందే.

- Advertisement -