అధికారమిస్తే.. అంధకారమే!

45
- Advertisement -

ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ అనుసరిస్తున్న వ్యూహాలు చూస్తుంటే.. చన్నప్పుడు చదువుకున్న కథలు గుర్తు రాక మానవు. ఓ వేటగాడు పక్షులను వేటాడేందుకు కొన్ని గింజలు వెదజల్లి ఆ గింజలపై వల ఉంచి వెళతాడు. పాపం ఆకలితో ఉన్న పక్షులకు గింజలు మాత్రమే కనిపిస్తాయి గాని.. ఆ గింజలపై ఉన్న వల మాత్రం కనిపించదు. ఫలితంగా గింజలు తినడానికి వలపై వాలినప్పుడు వలలో చిక్కుకొని వేటగాడికి ఆహారమైపోతాయి. ప్రస్తుతం కాంగ్రెస్ అనుసరిస్తున్న వ్యూహాలు కూడా ఇలాగే ఉన్నాయి. తెలంగాణలో అధికారం కోసం ఆచరణకు సాధ్యం కానీ హామీలను ప్రకటిస్తూ.. ప్రజల దృష్టిని మరల్చే ప్రయత్నం చేస్తోంది.

తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రూ. 500 లకే గ్యాస్ సిలిండర్ ఇస్తామని, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని, రైతుల ఖాతాల్లో రూ.15000 వేస్తామని, రైతు కూలీలకు రూ.12 అందిస్తామని, ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తామని, కల్లబొల్లి హమీలు గుప్పిస్తున్నారు. అయితే ఈ హామీలన్నీ చెరపట్టేందుకు ఎర అనే సంగతి తెలియనిది కాదు. ఆల్రెడీ కర్ణాటక ప్రజలు ఇదే హామీలను నమ్మి నట్టేట మునిగిపోయారు. అక్కడ ఇచ్చిన హామీలను గాలికి వదిలేసి చేతులు దులుపుకున్న పరిస్థితి. దొరికినంత దోచుకో.. దోచుకుంది పంచుకో అన్న రీతిలోనే సాగుతుంది అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వ తీరు. 11 సార్లు దేశంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇంతవరకు చేసిందేమి లేదు.

Also Read:ఎలక్షన్స్ కు షర్మిల గుడ్ బై.. ఆ భయంతోనే!

ఇప్పుడు తెలంగాణలో కూడా అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసేందుకు హస్తం పార్టీ ప్రయత్నిస్తోంది. అయితే హస్తం పార్టీ అక్రమ వ్యూహాలు, దుర్మార్గపు ప్రణాళికలు తెలంగాణ ప్రజలకు తెలియందేమీ కాదు. అందుకే రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ అని ఆ పార్టీ నేతలు చెబుతున్నప్పటికి.. కాదు కాదు రాష్ట్రాన్ని తెచ్చింది కే‌సి‌ఆర్ అంటూ బి‌ఆర్‌ఎస్ కు పట్టం కట్టారు. ఇక ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ రావడంతో అధికారం కోసం గోతికాడి నక్కల్లా హస్తం నేతలు ఎదురు చూస్తున్నారు.. వారికి అధికారమిస్తే.. అంధకారమే అనే సంగతి యావత్ ప్రజానీకానికి బాగా తెలుసు. అందుకే ఆ పార్టీని రాష్ట్ర ప్రజలు ఏ మాత్రం ఖాతరు చేయడం లేదని సర్వేలు తేల్చి చెబుతున్నాయి.

Also Read:KCR:జీవన్‌ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించండి

- Advertisement -