KCR:జీవన్‌ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించండి

37
- Advertisement -

రైతులకు నీళ్లు, కరెంట్ ఉచితంగా ఇస్తున్నామని తెలిపారు సీఎం కేసీఆర్. ఆర్మూర్ ప్రజా ఆశీర్వాదసభలో మాట్లాడిన సీఎం కేసీఆర్..ఎర్రజోన్న రైతుల కోసం పెద్ద ఎత్తున పోరాటం చేసిన వ్యక్తి జీవన్ రెడ్డి అన్నారు సీఎం కేసీఆర్. ఆమరణ దీక్ష చేసి వారి సమస్య పరిష్కారానికి కృషి చేశారన్నారు. ఆర్మూర్ జన ప్రభంజనం చూస్తే మరోసారి జీవన్ రెడ్డి గెలుపు ఖాయమైందన్నారు. నిజామాబాద్ అంకాపూర్‌ని తాను ప్రచారం చేసినట్లుగా ఎవరు చేయలేదన్నారు.అంకాపూర్ ప్రజల చైతన్యం అనేక గ్రామాలను కదిలించిందన్నారు. తెలంగాణ ఉద్యమంలో జీవన్ రెడ్డి కీలకపాత్ర పోషించారన్నారు. తన ప్రజలకు అనుకున్నది సాధించడం కోసం ఎంతవరకైనా వెళ్తారన్నారు.

ఓటు వేసే ముందు ప్రజలు ఓ సారి ఆలోచించాలన్నారు. ఏ పార్టీ పాలన ఏలా ఉందో తెలుసుకోవాలన్నారు. బీఆర్ఎస్ పార్టీ పుట్టిందే తెలంగాణ సాధన కోసమే అన్నారు. ఒక్కో సమస్యనూ పరిష్కరించుకంటూ ముందుకు సాగుతున్నామన్నారు. ప్రజల చేతిలో ఉన్న వజ్రాయుధం ఓటు అన్నారు.50 ఏండ్లు రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్ ఏం చేసిందో ఆలోచించాలన్నారు.

రైతు బాగుపడాలనే రైతు బంధు తీసుకొచ్చామని తెలిపారు. రైతు బంధు, రైతులకిచ్చే కరెంట్ పై కాంగ్రెస్ నేతలు అవాకులు, చవాకులు పేలుతున్నారన్నారు. కాంగ్రెస్ నాయకులకు మీరే బుద్ది చెప్పాలన్నారు. ఎన్నికల వస్తే ఆగం కావొద్దని…ఆలోచించి ఓటు వేయాలన్నారు. దళిత బంధు పథకాన్ని పుట్టించిందే బీఆర్ఎస్ ప్రభుత్వం అన్నారు.రాష్ట్రానికి ఆదాయం పెరుగుతున్న కొద్ది పథకాలకు డబ్బులు పెంచుకుంటు పోయామన్నారు. రూ. 5 వేల పెన్షన్ అందిస్తామని…దేశంలో ఏ రాష్ట్రంలో బీడీ కార్మికులకు పెన్షన్ ఇస్తున్నామన్నారు. బీడీ టేకేదారులకు పెన్షన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. ధరణి తీసెస్తే మళ్లీ పైరవీ కారులదే రాజ్యం అన్నారు. ఎన్నికల్లో పార్టీలు కాదు ప్రజలు గెలవాలన్నారు. జీవన్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలన్నారు.

Also Read:KCR:తెలంగాణలో శాశ్వతంగా కరెంట్ సమస్య ఉండదు

- Advertisement -