రైతుబంధుకు చెక్.. కాంగ్రెస్ ప్లాన్ ఆదేనా?

49
- Advertisement -

దేశంలో ఎక్కడ లేని విధంగా రైతు సంక్షేమమే ధ్యేయంగా సి‌ఎం కే‌సి‌ఆర్ రైతుబంధు అనే పథకాన్ని 2018లో ప్రవేశ పెట్టారు. వ్యవసాయం కోసం చమటోడ్ఛే రైతు కష్టాలను గుర్తించిన కే‌సి‌ఆర్ సాగు పెట్టుబడి నిమిత్తం ఈ పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. ఆ తరువాత దేశ వ్యాప్తంగా ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు ఆయా పేర్లతో రైతు బంధు పథకాన్ని ప్రవేశ పెట్టేందుకు సిద్దమౌతు వచ్చాయి. ఇలా ఇతర రాష్ట్రాలకు ఆదర్శప్రాయంగా ఉన్న రైతుబంధు పథకాన్ని కూని చేసేందుకు హస్తం పార్టీ సిద్దమైందా అంటే అవుననే అంటున్నారు రాజకీయవాదులు. తెలంగాణలో తాము అధికారంలోకి వస్తే ధరణి రద్దు చేస్తామని, పదే పదే చెబుతూ వస్తున్నారు కాంగ్రెస్ నేతలు. ధరణి ద్వారా రైతులకు నిష్పక్షపాతంగా భూ రిజిస్ట్రేషన్ పనులు జరుగుతున్నాయి. దీని ఆధారంగానే అర్హులైన రైతులు రైతుబంధు పథకాన్ని పొందుతున్నారు. .

మరి ధరణి రద్దు చేస్తే రైతు బందు ఎలా వస్తుందనే దానిపై మాత్రం కాంగ్రెస్ నేతలు క్లారిటీ ఇవ్వకపోవడం గమనార్హం. కాగా రైతు భరోసా కింద రూ. 15000 వేల రూపాయలు ప్రకటిస్తుంచినప్పటికి.. దానిని ఎలా అమలు చేస్తారనే దానిపై మాత్రం స్పష్టతనివ్వడం లేదు. దీన్నిబట్టి చూస్తే కాంగ్రెస్ ప్రకటిస్తున్న హామీలకు వారెంటీ లేదనే సంగతి ఇట్టే అర్థమౌతుంది. కాగా రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉన్న ధరణి, రైతుబంధు, 24 గంటల ఉచిత కరెంటు వంటి వాటిని రద్దు చేసేందుకు కాంగ్రెస్ ఎందుకు ప్రయత్నిస్తోందనే దానిపై విశ్లేషకులు చెబుతున్నా దాని ప్రకారం.. వాటి ద్వారా విడుదలయ్యే నిధులను దోపిడి చేసేందుకే అనేది కొందరి అభిప్రాయం. ఇప్పటికే కర్నాటక వంటి రాష్ట్రాల్లో పథకాల పేరుతో విడుదల చేసిన నిధుళలో పెద్ద ఎత్తున కుంభకోణాలకు పాల్పడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు తెలంగాణలో కూడా ఇదే ఫాలో అయ్యేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. మరి కాంగ్రెస్ వ్యూహాలను ప్రజలు ఎలా తిప్పి కొడతారో చూడాలి.

Also Read:ఫైనల్ లో ఆసీస్.. టీమిండియాకు కష్టమే?

- Advertisement -