రకుల్ ప్రీత్‌తో “ఇది మా ప్రేమకథ”..

110
Idhi Maa Prema Katha Teaser Released by Rakul Preet

యాంకర్ రవి హీరోగా పరిచమవుతూ నటిస్తున్న చిత్రం “ఇది మా ప్రేమ కథ”. రవి సరసన “శశిరేఖా పరిణయం” సీరియల్ ఫేమ్ మేఘన లోకేష్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మత్స్య క్రియేషన్స్-పి.ఎల్.కె ప్రొడక్షన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మస్తున్నాయి. యువ ప్రతిభాశాలి అయోధ్య కార్తీక్ దర్శకుడిగా పరిచయమవుతుండగా.. కార్తీక్ కొడకండ్ల సంగీత సారధ్యం వహిస్తున్నారు.

ప్రముఖ దర్శకులు పూరీ జగన్నాధ్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేయగా.. మెగాస్టార్ చిరంజీవి మోషన్ పోస్టర్ ను ఆవిష్కరించారు.తాజాగా ఈ చిత్రం టీజర్ ను పాపులర్ హీరోయిన్ రకుల్ ప్రీత్ విడుదల చేసింది.

Idhi Maa Prema Katha Teaser Released by Rakul Preet

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత పి.ఎల్.కె.రెడ్డి మాట్లాడుతూ.. “మా సినిమా మోషన్ పోస్టర్ ను మెగాస్టార్ చిరంజీవి స్వయంగా విడుదల చేసి.. అభినందించడంతోపాటు ఆశీర్వాదాలు కూడా అందించడంతో ఆనందంతో ఉక్కిరిబిక్కిరయ్యాం. ఇప్పుడు పాపులర్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ మా సినిమా టీజర్ ను విడుదల చేయడం ఆనందంగా ఉంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. వచ్చే నెలలో ఆడియోతోపాటు.. చిత్రాన్ని కూడా విడుదల చేసేందుకు సమాయత్తమవుతున్నాం” అన్నారు

Idhi Maa Prema Katha Teaser Released by Rakul Preet

దర్శకుడు అయోధ్య కార్తీక్ మాట్లాడుతూ.. “మా సినిమా ద్వారా పాపులర్ సీరియల్ ఆర్టిస్ట్ మేఘనా లోకేష్ ను హీరోయిన్ గా పరిచయం చేస్తున్నాం. త్వరలోనే ట్రైలర్ ను కూడా విడుదల చేసి.. జూన్ లో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాం” అన్నారు.
ఈ చిత్రానికి పబ్లిసిటీ డిజైన్స్: రమేష్ కొత్తపల్లి, పాటలు: దినేష్ (నాని), సినిమాటోగ్రఫీ: మోహన్ రెడ్డి, సంగీతం: కార్తీక్ కొడకండ్ల, నిర్మాణం: మత్స్య క్రియేషన్స్-పి.ఎల్.కె.క్రియేషన్స్, నిర్మాత: పి.ఎల్.కె.రెడ్డి, దర్శకత్వం: అయోధ్య కార్తీక్!!