బాండ్ రోజర్ మూర్.. మృతి

229
- Advertisement -

‘జేమ్స్ బాండ్’ హీరో సర్ రోజర్ మూర్ (89) మృతి చెందారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబసభ్యులు తెలిపారు. బరువెక్కిన హృదయాలతో ఈ బాధాకరమైన వార్తను తెలిపారు. గత కొద్దికాలం నుంచి క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన స్విట్జర్లాండ్‌లో తుదిశ్వాస విడిచినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఈ మేరకు మూర్‌ ట్వీటర్‌ అకౌంట్‌ ద్వారా మూర్‌ తనయుడు ట్వీట్‌ చేశారు. ఆఖరి రోజుల్లో మూర్‌ కుటుంబసభ్యులతో గడపడం వల్ల ఆయనకు తమపై ఉన్న ప్రేమ తెలిసిందని చెప్పారు. మొనాకోలో మూర్‌ భౌతికకాయానికి అంత్యక్రియలు జరపనున్నట్లు వెల్లడించారు.

Roger Moore dead

కాగా, ‘స్పై’ పాత్రలో రోజర్ మూర్ నటించారు. ‘లివ్ అండ్ లెట్ డై’, ‘స్పై హూ లవ్డ్ మీ’, ‘ఆక్టోపసీ’, ‘ఫర్ యువర్ ఐస్ ఓన్లీ’, ‘ఏ వ్యూ టూ ఏ కిల్’ సినిమాల్లో రోజర్ మూర్ ‘జేమ్స్ బాండ్’ పాత్రలు పోషించారు. ‘ది లాస్ట్ టైమ్ ఐ సా ప్యారిస్’, ‘ఇంటరప్టెడ్ మెలోడీ’, ‘ది కింగ్స్ థీఫ్’, ‘ది మిరాకిల్’ తదితర చిత్రాల్లో రోజర్ మూర్ నటించారు.

- Advertisement -