- Advertisement -
రిలయన్స్ జియో ప్రస్తుత టెలికాం రంగానికి చుక్కలు చూపిస్తూ ఆఫర్ల మీద ఆఫర్లను ప్రకటిస్తోంది. కళ్లుమిరుమిట్లు గొలిపే జియో ఆఫర్లు చూసి ఇతర నెట్‌వర్క్ కస్టమర్లంతా జియో బాట పడుతున్నారు. జియో ఎఫెక్ట్ ఎలా తట్టుకోవాలో తెలియక ఇతర నెట్‌వర్క్స్ అన్నీ జియో తరహా ఆఫర్స్ ఇవ్వడం మొదలుపెట్టాయి. ఈ నేపథ్యంలో ఐడియా సెల్యులార్ టెలికాం సంస్థ సరికొత్త ఆఫర్ ప్రవేశపెట్టింది.
టెలికాం సంస్థ ఐడియా సెల్యులార్ రూ.199 ప్రీపెయిడ్ ప్లాన్‌లో అందిస్తున్న డేటా బెనిఫిట్స్‌ను పెంచింది. ఇప్పటి వరకు ఈ ప్లాన్‌లో కస్టమర్లకు రోజుకు 1.4 జీబీ డేటాను అందించగా, ఇకపై 2 జీబీ డేటా లభ్యం కానుంది. ఈ మేరకు ఐడియా ఈ ప్లాన్‌లో డేటా బెనిఫిట్స్‌ను సవరించింది. ఈ ప్లాన్‌లో డేటాతోపాటు రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు, అన్‌లిమిటెడ్ కాల్స్ వస్తాయి. ఈ ప్లాన్ వాలిడిటీ 28 రోజులుగా ఉంది.
- Advertisement -