నేటి బిగ్ బాస్ ఎలిమినేటర్ యాంకర్ శ్యామల..

235
Shyamala-1
- Advertisement -

నాని వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న బిగ్ బాస్2 మంచి ప్రేక్షకాధరణ లభిస్తోంది. వారానికి ఒకరిని ఎలిమినేట్ చేస్తూ ఈ షోపై ఆసక్తి పెంచుతున్నాడు నాని. మొదటి వారంలో సంజన ఎలిమినేట్ కాగా.. రెండో వారంలో నూతన్ నాయుడు, మూడవ వారంలో కిరీటి దామరాజు ఎలిమిఏట్ అయ్యారు. ఇక ఈ వారంలో ఎవరు ఎలిమినేట్ అవుతారో అని ప్రేక్షకులు అంచనాలు వేస్తూ ఉన్నారు. కానీ ఈ వారం ఎలిమినేటర్ యాంకర్ శ్యామల అని ముందే తెలిసిపోయింది.

Anchor Shyamala

బిగ్ బాస్ హౌజ్ నుంచి బయటికి వచ్చిన శ్యామల, తనకు మద్దతు తెలిపిన వారందరికి ధన్యవాదాలు అంటూ ట్విట్టర్లో పోస్టు చేసింది. ప్రస్తుతం తన కొడుకు ఇషాన్ తో ఆడుకుంటున్నానని చెప్పింది. దీంతో ఈ వారం ఎలిమినేటర్ శ్యామల అనే విషయం ముందుగానే  తెలిసిపోయింది. అయితే శ్యామల పోస్టుపై బిగ్ బాస్ నిర్వాహకులు, స్టార్ మా మండిపడడంతో వెంటనే ఆ పోస్టును డిలీట్ చేసింది. కానీ అప్పటికే చాలా వరకు వైలర్ అయిపోయింది.

ఇదంతా పక్కన పెడితే.. బిగ్ బాస్ లైవ్ షో అంటూ చెప్పే నిర్వాహకుల గుట్టురట్టయింది. ముందే షూట్ చేసి, రికార్డు చేసిన కార్యక్రమాన్ని టెలిక్యాస్ట్ చేస్తున్నారని చెప్పడానికి శ్యామల పోస్టు ఒక ఉదాహరణగా చెప్పుకొవచ్చు. ఏది ఏమైనా.. ఈ వారం ఎలిమినేటర్ ఎవరా..? అనే సందేహం మాత్రం తీరుపోయింది.

- Advertisement -