రివ్యూ : ఇదం జగత్

361
sumanth idam jagath
- Advertisement -

గ‌త ఏడాది మ‌ళ్ళీ రావా అనే డీసెంట్ ల‌వ్ స్టోరీతో హిట్ కొట్టిన హీరో సుమంత్ తాజాగా ఇదం జగత్ అంటూ ప్రేక్షకుల ముందుకువచ్చారు. అనిల్ శ్రీకంఠం ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కిన ఈ సినిమా ద్వారా అంజు కురియన్ హీరోయిన్‌గా పరిచయం అవుతోంది. మరి ఇదం జగత్ అంటూ ప్రేక్షకుల ముందుకువచ్చిన ఈ సినిమాతో సుమంత్ ఆకట్టుకున్నాడా..?లేదా చూద్దాం

కథ :

నిషిత్ (సుమంత్ ) డబ్బు సంపాదన కోసం నైట్ రిపోర్టర్ గా మారతాడు. రాత్రిళ్లు జరిగే సంఘటలను షూట్ చేసి ఛానల్స్‌కు అమ్ముకుని డబ్బు సంపాదిస్తాడు. ఈ క్రమంలో హీరోయిన్ మహతి (అంజు కురియన్) వాళ్ల నాన్న హత్యను రికార్డుచేస్తాడు.దానిని క్యాష్ చేసుకునేందుకు భారీగా డబ్బు డిమాండ్ చేస్తాడు..?అయితే సుమంత్ వేసిన ప్లాన్ వర్కవుట్ అయిందా..?అసలు హత్యచేసింది ఎవరు..?చివరకు కథ ఎలా సుఖాంతం అయిందనేది తెరమీద చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్ :

సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్స్ కథ,సెకండ్ హాఫ్ సన్నివేశాలు. సుమంత్ తనదైన నటనతో మ్యాజిక్ చేశాడు. జర్నలిస్టుగా నిషిత్ పాత్రకు వందశాతం న్యాయం చేశాడు. హీరోయిన్ అంజు కురియన్ గ్లామర్ పరంగా అంతగా మెప్పించలేకపోయింది. ఇక హీరో ఫ్రెండ్ పాత్రలో సత్య,పోలీస్ ఆఫీసర్ గా శివాజీ రాజా,మిగితా నటీనటులు తమ పాత్రలకు న్యాయం చేశారు.

 idam jagath

మైనస్ పాయింట్స్ :

సినిమాకు మేజర్ మైనస్ పాయింట్స్ సాగదీసే సన్నివేశాలు,ఫస్ట్ హాఫ్ స్లోగా సాగడం.ఇంట్రస్టింగ్ పాయింట్ ఉన్న కథకు సరైన కథనం తోడైయితే సినిమా ఫలితం ఊహించినదానికంటే ఎక్కువగానే ఉంటుంది కానీ ఈ చిత్రం కథనం విషయం లో నిరాశపరచడంతో ఆ ప్రభావం సినిమా ఫలితం ఫై పడింది.

సాంకేతిక విభాగం :

సాంకేతికంగా సినిమా పర్వాలేదనిపిస్తుంది. శ్రీ చరణ్ పాకాల అందించిన సంగీతం బాగుంది. ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో సన్నివేశాలను ఎలివేట్ చేశాడు. సినిమాటోగ్రఫీ,ఎడిటింగ్ బాగుంది. నిర్మాణ విలువలు సాదా సీదాగా ఉండడంతో సినిమా స్క్రీన్ ఫై ఉన్నతంగా కనిపించలేకపోయింది.

Image result for idam jagath

తీర్పు :

క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకువచ్చిన చిత్రం ఇదం జగత్. సుమంత్ నటన , కథ సినిమాకు ప్లస్ పాయింట్స్ కాగా నెమ్మదిగా సాగే కథనం మైనస్ పాయింట్. ఓవరాల్‌గా ఆసక్తికరమైన థ్రిల్లర్ ను ప్రేక్షకులను అందించాలనుకుని చేసిన ప్రయత్నం నిరాశనే మిగిల్చింది.

విడుదల తేదీ : 18/12/18
రేటింగ్ : 2.5/5
నటీనటులు : సుమంత్ , అంజు కురియన్
సంగీతం : శ్రీ చరణ్ పాకాల
నిర్మాత : శ్రీధర్ గంగపట్నం
దర్శకత్వం : అనిల్ శ్రీకంఠం

- Advertisement -