సుమంత్ ‘ఇదం జగత్’ టీజర్..

243
- Advertisement -

సుమంత్ హీరోగా విభిన్నమైన కథాంశంతో తెరకెక్కిన చిత్రం ‘ఇదం జగత్’. అంజు కురియన్ ఈ చిత్రంతో నాయికగా పరిచయమవుతుంది. విరాట్ పిల్మ్స్ అండ్ శ్రీ విఘ్నేష్ కార్తీక్ సినిమాస్ పతాకాలపై అనీల్ శ్రీ కంఠం దర్శకత్వంలో జొన్నలగడ్డ పద్మావతి, గంగపట్నం శ్రీధర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సుమంత్ కెరీర్‌లో ఇప్పటి వరకు చేయనటువంటి నెగిటివ్ షేడ్స్ వున్న పాత్రలో కనిపించబోతున్నారు. ఈ సినిమా టీజర్ తాజాగా విడుదల చేశారు.

IdamJagath Movie Teaser

ఇక టీజర్‌ ఎలా ఉందంటే.. ఈ సినిమాలో థ్రిల్లర్ కు ఉండాల్సిన లక్షణాలు బాగానే కనిపిస్తున్నాయి. మేము ఒరిజినల్ న్యూస్ ఇస్తామంటూ – సమాజాన్ని బాగు చేస్తామంటూ స్లోగన్లు ఇచ్చిమరీ సమాజాన్ని అథోగతి పాలుచేసే ఫేక్ న్యూస్ ఇచ్చే జర్నలిజం పైన ఈ సినిమా ఉండబోతుందని తెలుస్తోంది. ఈ టీజర్‌కు కూడా అందరినీ ఆకట్టుకునేలావుంది. ఈ మూవీలో శివాజీరాజా, ఛలో ఫేమ్ సత్య, ప్రియదర్శిని రామ్, ఆదిత్య మీనన్ లు కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ టీజర్‌పై మీరూ ఓ లుక్కేయండి.

- Advertisement -