మరోసారి ఇంగ్లాండ్ తో తలపడనున్న భారత్

227
icc-t20-world-cup

ఐసిసి మహిళల టీ20 ప్రపంచకప్ లో భారత్ సెమీ ఫైనల్ కు చేరిన సంగతి తెలిసిందే. ఇండియాతో పాటు ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్ టీంలు సెమిఫైనల్ కు చేరుకున్నాయి. గురువారం సెమిఫైనల్ మ్యాచ్ జరుగనుంది. దీంతో సెమీస్ లో భారత్ తో తలపడే ప్రత్యర్థి జట్టుపై ఆసక్తి నెలకొంది. నేడు జరగాల్సిన సౌతాఫ్రికా, వెస్టిండిస్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో రెండు జట్లకు చెరో పాయింట్ ఇచ్చారు.

దీంతో ఇండియాతో సెమిఫైనల్ లో తనలపడేజట్టు ఖరారు అయింది. ఇంగ్లాండ్ జట్టుతో ఇండియా సెమిఫైనల్ లో ఆడనుంది. ఇప్పటివరకు మహిళల జట్టు మూడు సార్లు సెమీస్ కు వెళ్లిగా ఒక్కసారి కూడా ఫైనల్ కు వెళ్లలేదు. 2018 జరిగిన టోర్నీలోనూ సెమిఫైనల్ లో ఇండియా ఇంగ్లాడ్ లు తలపడంతో ఇంగ్లాండ్ గెలిచి ఫైనల్ కు వెళ్లింది. ఈసారి ఎలాగైనా ఇంగ్లాండ్ పై గెలిచి ఫైనల్ కు చేరుకొవాలనే పట్టదలతో ఉంది టీంఇండియా.