నకిలీ వార్తలు, వినియోగదారుల వ్యక్తిగత సమాచారం లీకవడం వంటి సమస్యలతో సతమతమవుతోంది ఫేస్ బుక్. ఈ నేపథ్యంలో ఆ సంస్థ సీఈవో జుకర్ బర్గ్ రాజీనామా చేస్తున్నారని వార్తలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ వార్తలను ఖండించారు జుకర్ బర్గ్. అంతేగాద్ ఫేస్ బుక్ సీవోవో షెరిల్ శాండ్ బర్గ్‌ను వెనకేసుకొచ్చిన జుకర్..ఆమె ఎంతో కీలకమైన వ్యక్తి అని ఫేస్ బుక్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు కృషిచేస్తున్నారు.
న్యూయార్క్ టైమ్స్ లో వచ్చిన కథనం అవాస్తవమని తెలిపారు జుకర్. వాషింగ్టన్ కంపె నీని ఫేస్‌బుక్ నియమించుకున్న సమాచారమే తమకు తెలీదనీ, ఆ పత్రికలో కథనం చదివిన తర్వాతనే తెలుసుకున్నానని వెల్లడించారు. ఆ కంపెనీతో తమ సంస్థ సంబంధాలను రద్దు చేసుకుందని …అలాగే ఫేస్ బుక్‌లో రష్యా జోక్యం గురించి కూడా తమకు ముందుగా తెలియదన్నారు.
మరోవైపు ఫేస్‌బుక్ తాజాగా మరో కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ఫేస్‌బుక్‌ను మీరు ఎంతసేపు వాడుతున్నారో రోజువారీ, వారం వారీ లెక్కలను ఈ కొత్త ఫీచర్ మీకు తెలియజేస్తుంది. ఫేస్‌బుక్ యాప్‌లో సెట్టింగ్స్ అండ్ ప్రైవసీ లోకి వెళితే యువర్ టైమ్ ఆన్ ఫేస్‌బుక్ అని కనిపిస్తుంది. ఆ ఆప్షన్‌ను ఎంచుకుంటే మీరు ఫేస్‌బుక్‌లో ఇప్పటివరకు గడిపిన సమయం కనిపించడంతోపాటు, రోజూ ఎంతసేపు బ్రౌజ్ చేయాలనుకుంటే అంత సమయం సెట్ చేసుకోవచ్చు.