2.0లో అతిథిగా ఐష్‌..!

251
aishwarya rai 2.0
- Advertisement -

సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా గ్రేట్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ సుభాష్ కరణ్ నిర్మిస్తున్న భారీ చిత్రం ‘2.0’. 600 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా నవంబర్ 29న ప్రేక్షకుల ముందుకురానుంది. ఇటీవలె సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకున్న ఈ చిత్రం నవంబర్ 29న ప్రేక్షకుల ముందుకురానుంది. ఒక్క కట్ లేకుండా యు/ఎ సర్టిఫికేట్ పొందిన ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇప్పటివరకు టీజర్,ట్రైలర్‌తో ఆసక్తిని రేకెత్తిందించగా తాజాగా మరో ఆసక్తికర వార్త చక్కర్లు కొడుతోంది. రోబో సినిమాలో సనాగా అలరించిన ఐశ్వర్యరాయ్ 2.0లో అతిథి పాత్రలో నటించిందనే వార్తలు వెలువడుతున్నాయి. అఫిషియల్ క్లారిటీ రాకపోయినా శంకర్ ప్రేక్షకులకు సర్‌ ప్రైజ్ ఇచ్చేలా ప్లాన్ చేశారని సినీ వర్గాల టాక్‌.

2.0ని విజువ‌ల్ వండ‌ర్‌గా తీర్చిదిద్ద‌డానికి 2150 వి.ఎఫ్‌.ఎక్స్ షాట్స్ ఉప‌యోగించారు. 3000 మంది వి.ఎఫ్‌.ఎక్స్ టెక్నీషియ‌న్స్.. 1000 టిపిక‌ల్ వి.ఎఫ్‌.ఎక్స్ షాట్ మేక‌ర్స్ ఈ సినిమా కోసం ప‌నిచేశారు. దాదాపు పదివేల థియేటర్లలో 2.0 విడుదలవుతున్నట్లు తెలుస్తోంది.

- Advertisement -