పాక్‌లో చిక్కుకున్న తెలుగు యువకుడు రిలీజ్..

71
pak

పాక్ చెరలో చిక్కుకున్న తెలుగు యువకుడు ప్రశాంత్ విడుదలయ్యాడు. 2017 ఏప్రిల్‌లో అదృశ్యమైన ప్రశాంత్ తన ప్రియురాలి కోసం పాకిస్తాన్ మీదుగా స్విట్జర్లాండ్ వెళ్లే క్రమంలో పాక్ అధికారులకు పట్టుబడ్డాడు. అప్పటినుండి పాక్‌లోనే ఉన్న ప్రశాంత్…ఎట్టకేలకు విడుదలై హైదరాబాద్‌కు చేరుకున్నారు.

వాఘా సరిహద్దులో పాక్ అధికారులు ఆ యువకుడిని భారత్‌కు అప్పగించారు. ప్రశాంత్‌ హైదరాబాద్‌లోని ఓ సాఫ్ట్‌వేర్ సంస్థలో పని చేశాడు. ప్రశాంత్‌ విడుదలతో అతని కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.