జమ్మి చెట్టు నాటిన హైదరాబాద్ కలెక్టర్ శర్మాన్ ఐఏఎస్..

53
Sharman IAS

ముఖ్యమంత్రి హరితహారం స్ఫూర్తితో రాజ్యసభ సభ్యులు ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా ఊరుఊరికో జమ్మిచెట్టు గుడిగుడికో జమ్మి చెట్టు కార్యక్రమాన్ని హైదరాబాద్ కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ శర్మాన్ ఐఏఎస్ జమ్మి చెట్టు నాటి ప్రారంభించారు.

ఈ సందర్బంగా శర్మాన్ కలెక్టర్.. మాట్లాడుతూ దేశంలో ఎక్కడలేని విధంగా మన రాష్ట్రంలో హరితహారం చేపట్టి భవిష్యత్ తరాలకు మంచి వాతావరణం ఉండేలా విరివిగా మొక్కలు నాటుతున్నారు. దీనికి మద్దతుగా ఎంపీ సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం చేపట్టి ప్రజల్లో పర్యావరణ పరిరక్షణ పైన మంచి అవగహన కల్పిస్తున్నారు.

ఇందులో భాగంగా ఊరుఊరికో జమ్మిచెట్టు గుడిగుడికో జమ్మి చెట్టు కార్యక్రమాన్ని చేపట్టి భవిష్యత్ తరాలకు జమ్మి చెట్టు ప్రాముఖ్యతను, సంప్రదాయాన్ని తెలియజేస్తున్నారు. జమ్మి చెట్టు విజయానికి ప్రతీక అని, దీన్ని పెద్దవాళ్ళకి ఇచ్చి ఆశీర్వాదం తీయూకోవడం ఆనవాయితీ అని అన్నారు. ఇంతటి మంచి కార్యక్రమాన్ని చేపట్టిన ఎంపీ సంతోష్ కుమార్ గారిని అభినందించారు.