మోసగాళ్లు టీజర్‌కు విశేష స్పందన…

133
manchu vishnu

మంచు విష్ణు హీరోగా హాలీవుడ్-ఇండియన్ ప్రొడక్షన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘మోసగాళ్లు’. అతిపెద్ద ఐటీ కుంభకోణాల్లో ఒకటిగా నిలిచిన స్కామ్ వెనుక ఉన్న మిస్టరీని చేధించే కథాంశంతో ఈ సినిమా భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోంది. ఇప్పటికే సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఫస్ట్ లుక్‌,క్యారెక్టర్‌ లుక్స్‌ని విడుదల చేసిన చిత్రయూనిట్ అక్టోబర్ 3న స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ చేత మోసగాళ్లు టీజర్‌ని రిలీజ్ చేసింది.

టీజర్‌కి విశేష స్పందన వస్తోంది. మిలియన్ల వ్యూస్‌తో దూసుకుపోతోంది. ‘మోస‌గాళ్లు’ చేసిన అతిపెద్ద భారీ స్కామ్ ఏ రేంజిలో ఉంటుందో ఈ టీజ‌ర్ చూపించ‌డం, దానిపై ఏకంగా అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ హెచ్చ‌రిస్తూ మాట్లాడ‌టంతో, సినిమాపై ఆస‌క్తి బాగా పెరిగి, ఆ స్కామ్ వెనుక క‌థేమిటో తెలుసుకోవాల‌నే కుతూహ‌లం క‌లుగుతోంది. ఈ టీజ‌ర్‌తో సినిమాపై ఎక్స్‌పెక్టేష‌న్స్ మ‌రింత‌ పెరిగాయి.

‘మోస‌గాళ్లు’ చిత్రం తెలుగుతో పాటు త‌మిళ‌, మ‌ల‌యాళం, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో ఏక కాలంలో విడుద‌ల కానున్న‌ది.విష్ణు మంచు లీడ్ రోల్ చేస్తూ నిర్మిస్తోన్న ఈ సినిమాని జెఫ్రీ గీ చిన్ డైరెక్ట్ చేస్తున్నారు. బాలీవుడ్ సీనియ‌ర్ స్టార్ యాక్ట‌ర్ సునీల్ శెట్టి ఈ చిత్రంతో టాలీవుడ్‌కు ప‌రిచ‌య‌మ‌వుతున్నారు.

Mosagallu Official Teaser | Vishnu Manchu | Kajal Aggarwal | Jeffrey Gee Chin | AVA Entertainment