పేద విద్యార్థికి ఆపన్నహస్తం అందించిన నటుడు ప్రకాష్ రాజ్

223
prakash raj

ఉత్తమ ప్రతిభ కలిగి చిన్నతనంలోనే కన్న తండ్రిని కోల్పోయి డబ్బు లేని కారణంగా ఉన్నత చదువులు చదవలేక పోతుంది అని సామాజిక మాధ్యమం ద్వారా తెలుసుకొని ఆ పేద విద్యార్థికి చదువుకోవడానికి కావాల్సిన ఆర్థిక సహాయం చేసి విద్యార్థినిలో మనోధైర్యాన్ని నింపి కుటుంబంలో సంతోషాన్ని కలిగించారు మంచి మనస్సు ఉన్న విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్.

వివరాల్లోకి వెళితే పశ్చిమ గోదావరి జిల్లా పెద్దేవరం గ్రామానికి చెందిన తిరిగిపల్లి సిరి చందన చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయినప్పటికీ పేదరికాన్ని జయించి డిగ్రీని పూర్తి చేయడం జరిగింది. మొదటి నుండి చదువులో చురుగ్గా ఉండేది ఆమె యూనివర్సిటీ ఆఫ్ సాలిఫర్డ్ (UK) లో మాస్టర్ చేయడానికి సీటు రావడం జరిగింది కానీ కళాశాల ఫీజు చెల్లించడం సాధ్యం కాదు అనే ఉద్దేశంతో తాను కాలేజీ లో ప్రవేశం కావడం నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి మ అనుకున్నారు.కానీ విద్యార్థి సిరి చందన సమీప బంధువు నరేందర్ సోషల్ మీడియాలో విషయాన్ని తెలిపారు.

ఈ విషయాన్ని చూసి ఉత్తమ ప్రతిభ కలిగిన విద్యార్థి ఆర్థిక కారణాల వల్ల చదువు ఆపడానికి వీలు లేదని ఉద్దేశంతో వివరాలను తెప్పించుకొని ఆ విద్యార్థికి కావలసిన ఫీజు అక్కడ సౌకర్యాలను స్వయంగా తన సొంత డబ్బులతో చెల్లి స్థానం అని హామీ ఇచ్చారు నటుడు ప్రకాష్ రాజ్ గారు. ఊహించని సహాయానికి ఆ కుటుంబం చాలా సంతోషం వ్యక్తం చేసి నాకు తండ్రి లేని లోటును ప్రకాష్ రాజు గారు తీర్చారు అని దీనితో తప్పకుండా ఉన్నత విద్యను అభ్యసించి ఉద్యోగం చేసి వారు నాలాంటి పేద విద్యార్థికి చేసిన సహాయాన్ని మర్చిపోకుండా ఉద్యోగంలో స్థిరపడిన తర్వాత భవిష్యత్తులో నేను మరో నలుగురు పేద విద్యార్థులకు ఈ విధంగా సహాయం చేస్తానని తెలపడం జరిగింది. ప్రకాష్ రాజు గారు చేసిన ఆర్థిక సహాయం తో విద్యార్థులు ఉన్నత విద్య దర్శించడం కోసం సమాయత్తమవుతోంది ఇంత పెద్ద సహాయం చేసి ప్రకాష్ గారికి విద్యార్థిని సిరి చందన మరియు ఆమె తల్లి కృతజ్ఞతలు తెలిపారు.