కొత్త ఆరంభం కోసం ఎదురుచూస్తున్నాం: మహేశ్ బక్రీద్ విషెస్

66
mahesh

బక్రీద్ పండగ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు సూపర్ స్టార్ మహేశ్‌ బాబు. ట్విట్టర్‌లో ఈ మేరకు ట్వీట్ చేసిన మహేశ్… ముస్లిం సోద‌రుల‌కి బక్రీద్ పండుగ శుభాకాంక్ష‌లు తెలిపారు.

బ‌క్రీద్ రోజున సార్వ‌త్రిక‌ సోదర స్ఫూర్తిని ప్ర‌ద‌ర్శించ‌డం ఆనందంగా ఉంటుందని… ఈ సంతోషకరమైన సందర్భం సమస్యాత్మక సమయాల్లో మనందరినీ ఒకచోట చేర్చి, మనలో చైతన్యం నింపుతుందన్నారు. అంతా కొత్త ఆరంభం కోసం ఎదురుచూస్తున్నామన్నారు మహేశ్‌.

సరిలేరు నీకెవ్వరూ హిట్‌తో జోష్ మీదున్న మహేశ్‌…ప్రస్తుతం పరుశరాం దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమా చేస్తున్నారు. ఇటీవలె విడుదలైన్ ఫస్ట్ లుక్ పోస్ట‌ర్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది.