రాష్ట్రంలో 24 గంటల్లో 2083 కరోనా కేసులు..

92
corona

తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 65 వేలకు చేరువయ్యాయి. గత 24 గంటల్లో 2083 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా 11 మంది మృతిచెందారు.

ఇక రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 64,786కు చేరగా 530 మంది మృత్యువాతపడ్డారు. ప్రస్తుతం తెలంగాణలో యాక్టివ్ పాజిటివ్ కేసుల సంఖ్య 17,754గా ఉండగా 46,502 మంది కరోనా మహమ్మారి నుండి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.

జీహెచ్‌ఎంసీ పరిధిలో 578, రంగారెడ్డి జిల్లాలో 228, మేడ్చల్‌ జిల్లాలో 197, వరంగల్‌ అర్బన్‌లో 134 కొత్తగా కరోనా కేసులు నమోదు అయ్యాయి.