క‌ళ్యాణ్ రామ్ కి నో చెప్పిన సాయి ప‌ల్ల‌వి..

293
kalyan ram
- Advertisement -

ప్రేమ‌మ్ సినిమాతో కుర్ర‌కారుని త‌న బుట్ట‌లో వెసుకుంది కేర‌ళ బ్యూటీ సాయి ప‌ల్ల‌వి. విభిన్నమైన క‌థ‌లు ఎంచుకుంటూ మినిమ‌మ్ గ్యారెంటీ హీట్ సినిమాల్లో న‌టిస్తుంది. ఇంత‌వ‌ర‌కూ ఆమె న‌టించిన సినిమాలు మంచి విజ‌యాన్ని అందుకున్నాయి. క‌థ‌ను ఎంచుకోవ‌టంలో సాయి ప‌ల్ల‌వి స్పెష‌లిస్ట్ గా చెప్పుకోవ‌చ్చు. క‌థ న‌చ్చ‌క‌పోతే ఎంత‌పెద్ద హీరోతో ఛాన్స్ వ‌చ్చినా ఆమె సినిమా చేయ‌దు అనే టాక్ ఉంది.

sai pallavi

పారితోష‌కం ఎక్కువ ఇస్తామ‌న్న ఆమె కాంప్ర‌మైజ్ కాదంట‌. ఆమెలోని ఈ లక్షణమే ఆమెకి మరింత మంది అభిమానులను చేసింది. తాజాగా ఆమె క‌థ న‌చ్చ‌క‌పోవ‌డంతో మ‌రో ద‌ర్శ‌కుడికి నో చెప్పినట్టు స‌మాచారం.

sai pallavi

‘ఉయ్యాలా జంపాలా’ .. ‘మజ్ను’ వంటి విజయవంతమైన సినిమాలను తెరకెక్కించిన విరించి వర్మ, సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఒక సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ ఈసినిమాలో హీరోగా న‌టించ‌న‌నున్నాడు. హీరోయిన్ పాత్ర కోసం సాయిప‌ల్ల‌విని సంప్ర‌దించార‌ట ద‌ర్శ‌కుడు. అయితే క‌థ‌లో హీరోయిన్ పాత్ర ఎక్కువ‌గా లేక‌పోవ‌డంతో ఆమె అంత‌గా ఇంట్ర‌స్ట్ చూప‌లేద‌ని స‌మాచారం.

- Advertisement -