చివ‌రి ద‌శ‌లో ఎఫ్ 2 షూటింగ్..

287
f2
- Advertisement -

యువ ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న మూవీ ఎఫ్ 2. వెంక‌టేశ్ , వ‌రుణ్ తేజ్ హీరోగా న‌టిస్తున్న ఈసినిమాలో మెహ‌రిన్, త‌మ‌న్నా హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈసినిమా షూటింగ్ చివ‌రి వ‌ర‌కు చేరుకుంది. హైద‌ర‌బాద్ లోని రామోజీ ఫిలీం సిటీలో ఈమూవీ చిత్ర‌క‌ర‌ణ జ‌రుగుతోంది. రేపటి నుంచి వరుసగా ఈ సినిమాకి సంబంధించిన అప్ డేట్స్ ఇవ్వడానికి టీమ్ రెడీ అవుతోంది.

f2

ఈమూవీని ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న విషయం తెలిసిందే. సంక్రాంతి పండుగకు ఈసినిమాను విడుద‌ల చేయ‌నున్నారు. సినిమా మొత్తంలో ఎక్క‌డ కూడా ఒక్క ఫైట్ కూడా ఉండ‌బోద‌ని స్ప‌ష్టం చేశారు చిత్ర‌యూనిట్. ఇటివ‌లే ఈసినిమా అవుట్ పుట్ ను చూసిన దిల్ రాజు చాలా హ్యాపిగా ఫీల‌య్యార‌ట‌. సంక్రాంతి బ‌రిలో చాలా సినిమాలు విడుద‌ల కానున్నాయి. ఈ సినిమా ఏ స్థాయిలో సందడి చేస్తుందో చూడాలి .

- Advertisement -