విలన్ పాత్రలో కాజల్‌..!

83
Kajal

జీవకో రుషి..పుర్రెకో బుద్ది అంటారు. ఇందుకు సినిమా తారలేం మినహాయింపు కాదు. ఎవరైన మీ డ్రీమ్ రోల్ ప్రాజెక్ట్ ఏంటీ అంటే..ఎప్పుడు చేసే రొటీన్ పాత్రలు కాకుండా కాస్త వెరైటీగా ప్రయోగాత్మక పాత్రలో మెరివాలనుకుంటారు. ఇంకొంత మందేమో ప్రముఖుల బయోపిక్ సినిమాల్లో నటించాలని కోరుకుంటారు. హీరోయిన్లు అయితే కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా..నటన ప్రాధాన్యత ఉన్న లేడి ఓరియంటేడ్ సినిమాల్లో నటించాలని ఉంది అని చెపుతారు. కానీ కలువకల్ల బామ్మ కాజల్‌ మాత్రం తన డ్రీమ్ రోల్‌ క్యారెక్టర్ ను కాస్త వెరైటీగా ఉండేలా కోరుకుంది.

Kajal

ఖైదీ నెంబర్ 150సినిమా సక్సెస్‌ను అభిమానులతో పంచుకుంటూ కాజల్ నిన్న ట్విట్టర్‌లో ఓ చాట్ సెషన్ నిర్వహించారు. చిరుతో నటించడం మర్చిపోలేని అనుభూతి అని, ఖైదీ నంబర్ 150 సక్సెస్ కొత్త ఉత్సాహాన్ని ఇచ్చిందని అమ్మడు తెలిపారు. ఈ సందర్భంగానే కాజల్‌ను ఓ అభిమాని మీ డ్రీమ్ రోల్ ఏంటి? అని ఓ ప్రశ్న అడగ్గా, కాజల్ అందుకు సమాధానంగా విలన్ తరహా నెగటివ్ రోల్ చేయడం తన డ్రీమ్ అని అన్నారు. దీంతో ఆ అభిమానిని కాస్త షాక్ గురైయ్యాడు. డ్రీమ్ ప్రాజెక్ట్ అంటే ఏ హీరోయిన్ అయినా మంచి గుర్తింపు తెచ్చే పాత్రలు చేయాలనుకుంటారు. కానీ కాజల్ మాత్రం విలన్ క్యారెక్టర్ చేయాలంటూ అందరిని ఆశ్చర్య పరిచింది. తన పదేళ్ళ కెరీర్‌లో కాజల్ సరదాగా సాగిపోయే యువతి పాత్రలే చేయడం తప్ప ఇలా విలన్ తరహాలో ఎప్పుడూ నటించలేదు. మరి భవిష్యత్‌లో ఆమె డ్రీమ్ రోల్‌ను ఏ దర్శకులైనా ఆఫర్ చేస్తారా అన్నది చూడాలి. ప్రస్తుతం కాజల్ తెలుగు, తమిళ భాషల్లో కలుపుకొని మూడు సినిమాలు చేస్తున్నారు. చిరంజీవి తో నటించిన ఖైదీ నంబర్ 150 సంక్రాంతి కానుకగా విడుదలై బాక్సాఫీస్ వద్ద వసూళ్ళ వర్షం కురిపిస్తోంది.