మగాళ్లు సెక్సీగా ఉంటారు….

188
Tamanna Bhatia Comments on Mens

“శ్రీ” చిత్రం తో తెలుగు చిత్ర పరిశ్రమకి పరిచయమైన నటి తమన్నా….టాలీవుడ్, కోలీవుడ్-బాలీవుడ్ లో వరుస సినిమాలతో దూసుకెళ్తుంది మిల్కీ బ్యూటీ తమన్నా. ఇటివలే అభినేత్రి సినిమాలో కీలక పాత్ర చేసి మెప్పించింది. హీరోయిన్ గా చేస్తునే.. ఐటమ్ సాంగులతో కూడా దుమ్ము లేపుతోంది. బాహుబలి సినిమాలోని అవంతిక పాత్ర తో దేశవ్యాప్తంగా ఆకట్టుకున్న ఈఅమ్మడు పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. ఆడవాళ్ళు సెక్సీగా ఉంటారనే కామెంట్స్‌పై తమన్నా తనదైన శైలిలో స్పందించింది.

Tamanna Bhatia Comments on Mens

ఆడవారే కాదు మగవారు కూడా సెక్సీగా ఉంటారంటూ మగవారి అందాలను పొగడేసింది. ఇటీవలే ఓ ఇంటర్వులో మగవారి గురించి చెప్పుకొచ్చింది మగాళ్లు కూడా సెక్సీగా ఉంటారు .. మగవారిలోని సెక్సీ కోణాన్ని ఎవరూ గుర్తించారు… కానీ ఆడవారిపై సెక్సీ కామెంట్స్ చేస్తారు అని అన్నది… అంతేకాదు సెక్సీ కామెంట్స్ ఎప్పుడు ఆడవారిపైనే ఎందుకు? అని ప్రశ్నించింది.. దీంతో నెటిజన్లు ఆడవారిపైనే సెక్సీ కామెంట్స్ చేస్తారు ఎందుకంటే మగవాళ్ళు తెరపై బొడ్డు, క్లీవేజ్ షో చేయరు.. మేకప్ వేసుకొని మతులు పోగొట్టరు.. చిన్న చిన్న డ్రెస్ లతో కెమెరా ముందు ఫోజులు ఇవ్వరు అని నెటిజన్లు కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు.

మిల్కీ బ్యూటీ తమన్నా బాలీవుడ్ దర్శకుడు రోహిత్ శెట్టి దర్శకత్వంలో రణ్‌వీర్ సింగ్ సరసన ఓ చిత్రంలో నటించనుందని టాలీవుడ్‌ వర్గాల సమాచారం.