శ్రీవారి సన్నిధిలో సాయికుమార్..

22
saikumar

నూతన ఆంగ్ల సంవత్సరం సందర్భంగా తిరుమల శ్రీవారిని ప్రముఖ‌ సినీ నటుడు సాయికుమార్ దర్శించుకున్నారు.. ఈ వేకువజామున రెండు గంటలకు వి.ఐ.పి‌ విరామ సమయంలో స్వామి వారి సేవలో పాల్గోని మొక్కులు చెల్లించుకున్నారు.. అనంతరం రంగనాయకుల మండపంలో‌ వేదపండితులు వేద ఆశీర్వాదం అందించగా.. ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి‌ స్వామి వారి తీర్ధ‌ ప్రసాదాలు అందజేశారు.

ఈ సందర్భంగా ఆలయం వెలుపలకు వచ్చిన నటుడు సాయికుమార్ మీడియాతో మాట్లాడుతూ.. రెండేళ్ళుగా టెన్షన్ లోనే ఉన్నామని ప్రముఖ సినీనటుడు సాయి కుమార్ అన్నారు. ఒమిక్రాన్ పట్ల జాగ్రత్తగా ఉండాలని, ఈసంవత్సరం తనకు ముఖ్యమైన సంవత్సరమని, మేకప్ వేసుకుని 50యేళ్ళు పూర్తవుతోందన్నారు.. ప్రస్తుతం ప్రభుదేవా, ధనుష్, నానిలతో సినిమాలు చేస్తున్నానని చెప్పారు. నిర్మాతల్లో చిన్న కఫ్యూషన్ ఉందని, ప్రస్తుత పరిస్థితులలో ఐక్యంగా అందరూ ముందుకు సాగాల్సిన అవసరం ఉందని,‌ ప్రభుత్వం నియమించిన కమిటీతో సమస్యలు పరిష్కారమవుతాయన్న నమ్మకం ఉందన్నారు.