మేజర్ అప్‌డేట్ ఇచ్చిన అడవి శేష్..

30
major

అడివి శేష్ హీరోగా రాబోతోన్న మేజర్ సినిమాకు సంబంధించిన అప్డేట్ వచ్చింది. మేజర్ సినిమా హిందీ డబ్బింగ్ ప్రారంభమైందని.. 2022ను ఘ‌నంగా ప్రారంభించుదాం అని పేర్కొన్నారు అడవి శేష్. హిందీలో తానే స్వయంగా డబ్బింగ్ చెబుతున్నారు అడవి శేష్.

ప్రపంచ వ్యాప్తంగా ఫిబ్రవరి 11న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మూడడు భాషల్లో హిందీ, తెలుగు, మళయాల భాషల్లో ఈ సినిమా విడుదల కాబోతోంది. మహేష్ బాబు జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్, ఏ ప్లస్ ఎస్ మూవీస్, సోనీ పిక్చర్స్ సంయుక్తంగా కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. శ్రీచరణ్ పాకాల ఈ చిత్రానికి సంగీత దర్శకుడు

మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమాను తెరెక్కిస్తున్నారు. 26/11 దాడుల్లో ఆయన చూపించిన తెగువ, ధైర్య సాహసాలు మాత్రమే కాకుండా ఆయన జీవితంలోని ప్రతీ ఒక్క ఘటనను చూపించబోతోన్నారు. ఆయన ఏ స్ఫూర్తితో జీవించారు.. ఎలా మరణించారు అనేవి అందరినీ కట్టిపడేసేలా చూపించనున్నారు.